కీ. శే. శ్రీ ఆర్. వెంకటరామన్ గారు…


ఆర్. వెంకటరామన్ గారు లోకాలు మారారు. ఆయన సాధుస్వభావం, మంచితనం, మంచి మాట, ఓర్పు, చేయగలిగినంతలో చూపించిన నేర్పు గుర్తు పెట్టుకోవలసినవే.
ఆయన స్థాపించిన లేబర్ లా జర్నల్ ఆయన ఎంచుకుని పాటుపడ్డ క్షేత్రంలో ఒక లైట్ హవుస్ లాగా ఎప్పటికీ నిలచి ఉంటుంది. భారత రాష్ట్రపతిగా గుర్తుకొచ్చే ముందు తమిళనాడులోని పరిశ్రమలు ఆయనను గుర్తు చేసుకుంటాయి !

ఐదు ఏండ్లలో నాలుగు ప్రధానులతో పని చేసి ‘ రాష్ట్రపతి ఒక ఎమర్జన్సీ లైట్ లాంటి వాడు. లైట్ పోగానే స్వయంగా వెలిగి దారి చూపాలి ‘ అని ప్రభుత్వాలు పడిపోవటం గురించి అన్నారు. జాతీయ ప్రభుత్వాలు (నేషనల్ గవర్న్మెంట్లు) దేశానికి మంచివేనని ఉద్ఘాటించారు.

రాజ్యాంగాన్ని తయారు చేయు కమిటీలో ఆయన ఒక సభ్యుడిగా ఉన్నప్పటికీ రాష్ట్రపతి పదవినుంచి ఇవతలికి వచ్చాక ఎన్నో సవరణల గురించి ఆయన ప్రస్తావించారు. రెండు పార్టీల ప్రజాస్వామ్యాన్ని కూడా ప్రతిపాదించారు. చిన్న చిన్న పార్టీలు మన లోక్సభను ఎన్ని సార్లు రద్దు చేస్తాయి అని అడిగారు.

శ్రీలంకలో రాజీవ్ గాంధీ మీద అటాక్ జరిగాక రాష్ట్రపతిగ ఆయన ప్రొటొకాల్ ను మరచి ఎయిర్పోర్ట్ లో పరామర్శించేందుకు వెళ్లినప్పుడు జనం గోల చేశారు. కాకపోతే ఆయన భారత రత్న వంటి బిరుదులు ప్రదానం చేస్తున్నప్పుడు కూడా వేదిక మీదకు ఎక్కలేని వారికి ఆయనే క్రిందకు వచ్చి బిరుదు ప్రదానం చేసిన రోజులున్నాయి. పోస్టల్ బిల్ కు ఆమోదం ఇయ్యకుండా దానిని అటార్నీ జనరల్ కు పంపాలని మరి ఆయనే సూచించారు. ( ఈ బిల్లుకు జైల్ సింగ్ గారు కూడా అంతకు క్రితం ఆమోదం చెప్పలేదు!) క్రమంగా రాష్ట్రపతి పదవికి కొంత రియలిసం ఆయన మొదలు పెట్టారనే చెప్పాలి. పదవి వదిలాక కూడా పెదవి పలుకుతూనే ఉంది !

ఆయనకు వీడ్కోలు చెప్పుతూ అప్పటి స్పీకర్ శివ్రాజ్ పాటిల్ గారు పొగడ్తలతో ముంచెత్తినప్పుడు ఇవన్నీ నమ్మేటంత స్టుపిడ్ను నేను కాను అని నవ్వేశారు!

ఆయన రచించిన ఆత్మకథ-మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ ఆలోచనలను రేకెత్తించే పుస్తకం. మన రాజ్యాంగం గురించి చర్చలో పాల్గొనాలంటే ఈ పుస్తకం చదవాలి.

ఈశ్వరుడు ఆయన ఆత్మకు శాంతి కలుగ జేయు గాక !

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: