ఆర్.బీ.ఐ గవర్నర్ గారి ఇంటర్వ్యూ-కొన్ని ప్రశ్నలు-వేదాంతం శ్రీపతి శర్మ


రిసర్వ్ బాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గారు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ కొన్ని ప్రశ్నలను పైకి లేపింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా రెండే మాసాలున్నాయి. ఇంఫ్లేషన్ రేటు పడుతున్నందుకు కొన్ని కారణాలు చెప్పవచ్చును కానీ ఈ వేగంతో ఎందుకు పడుతోందో మరి చెప్పలేకపోవటం బాధాకరం. హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ దిగిపోవటంలో దీని పాత్ర ఏ మేరకు ఉందీ అనేది ఒక విశ్లేషణ చేయటంలో తప్పు లేదు.

ఆర్థిక పరిస్థితులు ఈ విధంగా ఉన్నప్పుడు సామాన్యంగా ఎవరినీ ఎవరూ నమ్మరు. గవర్నర్ గారు మన బాంకులను పూర్తిగా నమ్మకుండా మానిటరీ విధానాన్ని కొద్దిగా ఆచరణ మార్గం వైపుకు తీసుకుని వెళితే బాగుంటుంది. అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం గారు రైతు సోదరులకు ఇచ్చిన ఋణ మాఫీలు ఎన్ని బాంకులు చేశాయో అందరికీ తెలిసినదే. అసలు మంత్రిగారు బడ్జెట్ లో దానికి సంబంధించిన కేటాయింపు చేశారో లేదో అనేది కూడా ప్రశ్నార్థకమే!

విధానాలకు బాంకుల స్పందన తూగుతున్నదా అనేది నమ్మసక్యమైనది కాదు. సామాన్యుడికి అసలు ఈ బాంకులు లోపల ఏమి చేస్తున్నాయి అనే భయం కూడా ఉన్నది. ఉదాహరణకి వడ్డీ రేట్లని తగ్గించామని ప్రభుత్వం ప్రకటించింది. ఏమీ జరగలేదు. మార్చ్ అయిపొYఎ వరకూ అలా కళ్లు మూసుకుని ఉంటారు. కొన్ని జాతీయ బాంకులలో అయితే లోను కోసం వెళితే ‘ ఇంకా ఏమీ ఆదేశాలు రాలేదండీ. పేపర్లలో చాలా చెబుతారు…’ అంటున్నారు!

అదలా ఉంచండి. 24% క్రెడిట్ లక్ష్యం ఈ బాంకులు మీకు సాధించి పెడతాయని అంటున్నారు, అది జరగదు! తస్మాత్ జాగ్రత్త!

ఇంఫ్లేషన్ బాగుపడింది అని మీకు అనిపిస్తున్నది. కాకపోతే కేంద్రం ఫిస్కల్ డెఫిసిట్ 8%, రాష్ట్రాలది 2.5% ఉండగలదు అన్నారు. ఆలోచన బాగుంది కానీ నాన్-ప్లాన్ వ్యయం దగ్గర రాబోయె ఎన్నికల నేపథ్యంలో ఆర్. బీ. ఐ ఏమి చేయగలదో ఆలోచిస్తే పెద్దగా ధైర్యం కలగటంలేదు.

టెలికాం స్పెక్ట్రం వేలం నుంచి ప్రభుత్వం చేయబోయే ధనార్జన ఆర్థిక విధానాలలో ఎంతగా ఆదర్శవంతమైనదీ అనేది చర్చనీయాంశం. అహ్లువాలియా గారు కూడా పెద్దగా ఏ వేదిక మీదనైనా దీనిని చర్చించినట్లు తెలియటంలేదు.

సత్యం-సమస్య మీద దర్యాప్తు అయి ఏదైనా తేలితే తప్ప ఏమీ చెప్పలేమని అన్నారు. ఏమి చెప్పాలి ఈ దర్యాప్తు మీకు? దొంగలెవరనా? డబ్బు ఎక్కడున్నదనా? మీ ఆర్థిక వ్యవస్థలో సామాన్యుడికోసం ప్రొవిసన్లు లేవా?

చివరిగా మాన్యులకు ఈ సామాన్యుని విన్నపం ఒకటున్నది-ఆర్.బీ.ఐ విధానాలు ఎంతగా ప్రభుత్వంలోని మహారాజులను వంచగలవో చాలా కాలంగా చూస్తున్నాం. ఆర్.బీ.ఐ ఉత్తర్వులను బాంకులు ఎలా చుట్టూతా తిప్పి వాళ్లకు కావలిసినదే ఎలా చెసుకు పోతారో గత నాలుగేండ్లుగా చూస్తున్నాము. నెగెటివ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇంఫ్లేషన్ ఉండవచ్చు అని మీరే చెబుతున్నారు. కొన్ని భౌగోళికమైనవి, ఆంతరంగికమైనవి ఎలాగో మనలను కలవర పెట్టనున్నాయి.

సమయం అట్టే లేదు.

మానెటరీ విధానంలో మరి కొన్ని గట్టి చర్యలు అవసరం. ప్రభుత్వాన్నీ, బాంకులనీ నమ్మే రోజులివి కావు. ‘ మీ కేంద్ర బాంకు ‘-పెద్ద బాంకు మీద కొంత ఆశ ఉంది!

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: