ఫిట్టింగ్ మాస్టర్-తెలుగు చలన చిత్రం-వేదాంతం శ్రీపతి శర్మ సమీక్ష


అల్లరి నరేశ్ గమ్యం అను సినిమాలో పని చేసిన తీరుకు కొద్దిగా ప్రభావితుడనయి కొంత భిన్నమైన పాత్ర పోషణ ఉండగలదు అనే ఆశతో ఈ సినిమా ముందు కూర్చున్నాను.

కాకపోతే ఇది ఇ.వి.వి. సత్యనారయణ గారి తప్పో, లేక నరేశ్ తప్పో కాదు. చలన చిత్ర రంగం కొద్దిగా చిత్రమైనది. ఎంచుకున్న విషయం ప్రేక్షకునికి చివరకు ఎలా కనిపిస్తోంది అనేది ఒక మూసకు తప్పనిసరిగా లొంగిపోయి వ్యవహరిస్తున్న దర్శకులు చూడలేని పరిస్థితి.

పిల్లలు అర్థం లేని ప్రేమా, దోమా అంటూ తల్లి దండ్రులకు దూరమయ్యి నానా అగచాట్లు పడి అందరి చావూ చవి చూస్తున్నారని చూపించారు. మమ్మలని కూడా బాధించారు!

హీరో ప్రతీకారం విషయం ఏ పాయింట్ వరకూ తెర మీద ఎలా ప్రతిబింబించాలీ అనే విషయం మీద సరైన హోంవర్క్ జరగలేదు! అలా సమస్యను హీరో చెల్లెలు ద్వారా ఎంచుకున్న దర్శకుడు సమాధానంగా హీరోయిన్ దగ్గర పాత్ర చిత్రీకరణలో విఫలులైనారు. ఆ అమ్మాయిని హీరో కర్చీఫులు, రిబ్బన్లు తొడుక్కుని రోడ్డు మీదకి రావద్దంటూనే అవే దుస్తులతో డాన్సులు చేయించారు. దట్ ఈస్ తెలుగు సినిమా!

సతీశ్, బలరాం వ్రాసిన మాటలు ఈ నాటి ఒరవడికి తాళం వేశాయి. బొంగు, వి.పి, తొక్క లాంటి పదాలు వాడకపోవటం వలన నష్టం ఏముండదు. పైగా భాష విషయంలో సెన్సార్ వారు చేస్తున్న పని మంచిది కాదు. ఇది కలుషితం చేస్తున్నట్లు మరేదీ కలుషితం చేయదు. ఒకటో క్లాసు పిల్లలు కూడా ఏమి అంటున్నారో తెలియకుండానే ఈ చెత్త మాటలు మాట్లాడుతున్నారు.

చిన్న ఇచ్చిన సంగీతం రాప్ తో తొలి భాగంలో బాగానే మిక్స్ అయింది. సినిమాలోని రెండవ పాటలో ట్రాక్ దెబ్బ తిన్నదని చెప్పాలి.

స్క్రీన్ ప్లేలో వేగం ఎక్కువయినది. ఇది కథ అని తెలిసిపోయాక ప్రేక్షకులను కుర్చీలలో కూర్చోపెట్టటానికి దర్శకుడు ఏమీ కృషి చేయలేదు!

పాటల చిత్రీకరణ విషయంలో కొంత ఆలోచనను వెచ్చించారు. సీనుకీ సీనుకీ మధ్య లింకులు కూడా బాగున్నాయి. కానీ సినిమా యావత్తూ విషయానికీ, కథనానికీ ఏర్పడని పొంతన వలన తీవ్రంగా గాయపడినది.

చర్చనీయమైన అంశాన్ని ప్రతిపాదిస్తూ చర్చను ఇతివృత్తంలో ‘ గర్భం ‘ లోకి చేర్చకపోతే ఏ రూపకానికైనా జరిగే అన్యాయం ఇదే! ప్రేక్షకుడు అంశానికీ, చర్చకు, రెండిటికీ దూరమైపోయాడు.

జాన్ ఒస్బోర్న్ చిత్రం ‘ లుక్ బేక్ ఇన్ ఏంగర్ ‘(1956) మామూలుగా చూసి సామాజిక విషయాల మీద కథనం-ట్రీట్మెంట్ ఎలా ఉండవచ్చు అనేది తెలుసుకోవచ్చు.

అల్లరి నరేశ్ కష్టపడి నటించినా రెండవ భాగంలో వెళ్లిపోవాలనేటట్లే ఈ సినిమా తయారయింది.

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “ఫిట్టింగ్ మాస్టర్-తెలుగు చలన చిత్రం-వేదాంతం శ్రీపతి శర్మ సమీక్ష

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: