మన ‘భజనతంత్రం’-వేదాంతం శ్రీపతి శర్మ


ప్రజా స్వామ్యంలో మన దేశం ఎప్పుడు హవుస్ ఫుల్ అవుతుంది? అని ఒక మిత్రుడు అడుగుతూ ఉండే వాడు. ఎందుకలా అడుగుతున్నాడు అనుకునే వాడిని. అతను సెఫాలజీ అధ్యయనం చేస్తాడు. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఎవరు గెలుస్తారు? వంద మంది వోటు వేస్తే ఎనిమిది మందికి పది వోట్లు వచ్చి ఒకడికి ఇరవై వస్తే వాడు గెలుస్తాడు. వందలో ఇరవై బహుమతమా? ఒక విధంగా ఆలోచిస్తే మన రాజ్యాంగం రాజకీయ దళాలకు ఇచ్చినన్ని అవకాశాలు దేశపు పౌరునకి కూడా ఇవ్వలేదు అనిపిస్తుంది. బహుదళీయ ప్రజాస్వామ్యం ఇంతకాలం ఇంత జనాభా గల దేశంలో కొనసాగుతోందీ అంటే ఇది చెప్పుకో దగ్గ విషయం.
కాకపోతే జనం ఏ మాత్రం అవగాహనతో ఉన్నారు అనేది బాధాకరమైనది. పల్లెల్లో, మామూలు టవున్లలో ఉన్న రాజకీయ అవగాహన పట్టణాలలో లేనే లేదు. ఈ రోజు ఎకనమిక్ టైంస్ లో ఒక సర్వే ఉంది. ఇందులో ముఖ్యమైన పట్టణాలలో మన గణతంత్రం ఎప్పుడు అని అడిగితే చెన్నై నగరంలో 83% తప్పు సమాధానం ఇచ్చారు! హైదరాబాద్ లో 43% 1951 అని సెలవిచ్చారు. మన తొలి రాష్ట్రపతి ఎవరు అంటే ముంబైలో 39% సరిగ్గా చెప్పారు!
బెంగళూరు నగరం ఒక్కటే మెరుగైన గణాంకాలను చూపించింది.

ప్రపంచంలో రాబోయే అయిదు సంవత్సరాలలో మనదేశం, చైనా, ఒకటి రెండు ఆసియా ఖండం దేశాలు తప్ప అన్ని చోట్లా కేవలం వయో వృధ్ధులే మిగిలి ఉంటారని అంచనా! మన దేశం యువత – ఎటువంటి యువత ప్రపంచ రాజకీయాలలో కూడా కీలకమైన పాత్ర పోషించాలి. ఎలా? ఇలాగేనా?

లక్షలలో ఒక బానరు క్రింద కూర్చున్న జనం ఎందుకు కూర్చున్నారు? విధానం అంటే ఏమిటి? ఒక ఆర్థిక విశ్లేషణ ఎలా ఉండాలి? ప్రపంచ సమస్యలకు, మన దేశం సమస్యలకు గల అనుబంధాలు ఏమిటి? మనం ఎక్కడి నుంచి వచ్చాము? ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నాము? ఆసక్తికరమైన చర్చలు ‘ నాయకుల ‘ తో చేసే పరిస్థితి ఏది?

‘ఎన్నికలు పనిలేని వారికి పండుగలు ‘ అన్నాడు ఒకాయన!.

ఎమర్జన్సీ రోజులలో తెన్నేటి విశ్వనాథం గారిని విశాఖ జైలులో పెట్టినప్పుడు ఆయన జైలులోంచి జిల్లా కలెక్టర్ గారికి తనకు ప్రజలతో మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వాలి అని ఒక లేఖ వ్రాశారు. ఆయనకు అనుమతి కూడా లభించింది. ఆయన స్వాతంత్ర్యాన్ని, అవసరాన్ని, కేవలం ఒక లేఖ ద్వారా సమన్వయం చేసి చూపించారు.

ఇందులో భాష ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఉద్యమంలో సాహిత్యం, రచనలు, ప్రచురణ రంగం యొక్క ప్రధానమైన భాగస్వామ్యం ఉంది. హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో కొన్ని రోజులు ఒక సినిమా షూటింగ్ జరిగింది. ఆ రోజులలో జనం బాగా కనిపించారు. అక్కడ హీరోయిన్ కోసం మన దేశం భవిష్యత్తు చుట్టు ముట్టింది. పుస్తకాల స్టాళ్లలో అందరూ నోట్లో వేళ్లు వేసుకుని కూర్చున్నారు!

పండుగ జరపాలన్నా ఒక సినీ హీరో ఇంటిలో ఎలా జరుపుకుంటాడో అనేది టి.వీ లో చూస్తే గానీ మొహం కడుక్కోని జనం…

‘ నీ సంఘం, నీ ధర్మం, నీ దేశం నువ్వు మరువద్దు, జాతిని నిలిపి, నీతిని నిలిపిన మహనీయులనే మరువద్దు…ఆ సంస్కర్తల ఆశయరంగం నీవు నిలిచిన సంఘం, నీవు నిలిపిన ఈ సంఘం ‘ ఎంత గొప్ప మాట చెప్పారు కవి? పోనీ ఒక చలనచిత్రంలో చెప్పిన మాటే కదా? వింటారా?

Freedom is not independence. ‘ Freedom…’ said Marx, ‘ …is the appreciation of necessity and necessity is blind but only in so far as it is not understood ‘.
We need to discover and rediscover this essential link between freedom and necessity while relishing our freedom every minute!

Dear young friends, it is high time!

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “మన ‘భజనతంత్రం’-వేదాంతం శ్రీపతి శర్మ

  1. Well said Sir, I fully agree with your views. We make the democracy as mobacracy in India. How to change this system ? When our people, political leaders and intellectuals change this system?. Independence day and Republic days are become extra holidays for us to look after our own affairs, but not to review or think over our present cicurstamances in the world scenario, which is rapidly changing. Only cine stars, cricketers are drawing the attention our people, but not the scientists or social activitists. What a poor country is ours.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: