నవ్వు-నాలుగు విధాలు…వేదాంతం శ్రీపతి శర్మ


‘ ఎందుకు ప్రతి దానికీ నవ్వుతారు? ‘ అనె వాడు ఒక ఆఫీసరు.
‘ ఇదిగో ఎప్పుడూ సోడా బుడ్డీ లాగా ఆ మొహం ఎందుకు? కాస్త నవ్వవయ్యా ‘, అనే వాడు మరో ఆఫీసరు.
నవ్వాలా వద్దా? ఏమో!
వదిలేద్దాం. మన్సు మటుకు నవ్వుకుంటూ ఉంటే చాలు.
బర్ట్రెండ్ రసెల్ గారు 1932 లో ఒక మంచి మాట చెప్పారు. జంతువులు సంతోషం వ్యక్త పరచేందుకు కొన్ని పధ్ధతులు వాడతాయి. మనుషులు ఆనందం లేనప్పుడు కూడా నవ్వుతారు, చిరునవ్వులు చిందిస్తారు! దీనిని మానర్స్ అని, నమ్రత అని నానా విధాలుగా వ్యవహరిస్తారు.
పసి పిల్లలను తీసుకోండి. నిజంగా ఆనందం వేసినప్పుడే చక్కగా నవ్వుతారు. కొత్త వాళ్లను అలా దీర్ఘంగా చూస్తారు. అంతే. కానీ ఇంతలో పెద్దలు వారికి అనవసరమైన ఒక చిరునవ్వును అలవాటు చేసేస్తారు. వారు పెద్దలైపోతారు!

జపాన్లో 1868 వరకు ఒక వింత విధానం ఉండేది. సంఘంలో పెద్దవాడి ముందర చిన్న వాడు అతను (పెద్దవాడు) ఉన్నంత సేపూ నవ్వుతూ ఉండకపోతే పెద్ద వాడికి చిన్న వాడిని చంపగలిగే అర్హత ఉండేది!
అందువలన జపాన్ వాళ్లు చాలా ఆనందంగా ఉంటారు అని అందరూ అంకునే వారు. ఇది వారికి ప్రాణ సంకటం అని చాలా మందికి తెలీదు!

కొరియాలో ఉల్టాగా ఉండేది. రాజు సమక్షంలో అక్కడికి చచ్చిన వారు నిరంతరం ఒణుకుతూ ఉన్నట్లు నటిస్తూ నిలబడాలి-ఛలి జ్వరం వచ్చిన వాడిలాగా అటూ ఇటూ వొణకాలన్న మాట!

ఇంగ్లండులో బట్లర్కు ఎంత నవ్వొచ్చినా పొరపాటుగా కూడా ఉద్యోగం ఇచ్చిన వారి ముందర నవ్వ కూడదు!

భార్యా భర్తల మధ్యా ఇలాంటి సమస్యలు తప్పటంలేదు.
‘ ఆమె ముందర ఏమిటి ఆ నవ్వులు? ‘, భార్య అడుగుతూ ఉంటుంది.
‘ ఆ..అంత నవ్వొస్తోందా? ఒహో! పోయి కాఫీ పట్టుకు రా! ‘, భర్త అంటూ ఉంటాడు.
‘ పరాయ వాళ్ల ముందర పిచ్చ జోకులు, వెక్కిలి నవ్వులు. వాళ్లు వెళ్లగానే చిటపటలు, రుస రుసలు…’
‘ ఓహో, ఇంటికొచ్చింది నా వైపు వాళ్లైతే ఇరానీ కేఫ్లో బేరర్ లాగా మూతి ముడుచుకుని టీ కప్పులు పెడతావు. అదే నీ వైపు వాళ్లైతే ఎక్కడ లేని వయ్యారం, కిల కిలలు ఓహో, ఇల్లంతా సందడే! ‘

ఇదండీ వరస! అసలు ఏ.కే.47 అంటే అది గన్ను కాదు. అత్తా కోడల్ల తగువులు అని అర్థం.

ఇంతకీ వివాహం అయిన వాళ్లు నవ్వలేక ఏడుస్తున్నారేమో! ఇంకొకరి ముందు ఏడవలేక నవ్వుతున్నారేమో!

‘ ఎంకవుంటర్లన్నీ పోలీసుల హత్యలే ‘ అని కామ్రేడ్స్ గోడల మీద వ్రాస్తూ ఉంటారు.

హేంలెట్ లా ఆలోచిస్తే పెళ్లిళ్లన్నీ సామాజిక హత్యలేనా?

ఏమో!

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

2 thoughts on “నవ్వు-నాలుగు విధాలు…వేదాంతం శ్రీపతి శర్మ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: