25.01.2009 నుంచి 31.01.2009 వరకు రాశి ఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మశ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత:
సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక:
నిరంతరం మంగళమాతనోతు!

25.01.2009 నుంచి 31.01.2009 వరకు రాశి ఫలాలు ఇలా ఉన్నాయి:

ఈ వారం రవి గురు రాహువులు మకరం లోనూ, శని సింహంలోనూ, కేతువు కర్కాటకంలోనూ, కుజుడు, బుధుడు ధను మకరములలోనూ, శుక్రుడు కుంభ మీన రాశులలోనూ, చంద్రుడు ధను, మకర, కుంభ, మీన రాశులలోనూ సంచరిస్తారు.
26.01.2009 న రాహుగ్రస్త సూర్య గ్రహణం మధ్యాహ్నం 2.44 నుండి 4.55 వరకు హైదరాబాదు వారికి ఉందగలదని మనవి. గ్రహణం మకర రాశిలో శ్రవణా నక్షత్రంలో కాబట్టి మకర రాశి వారు. శ్రవణా నక్షత్రం వారు ప్రత్యేకమైన శాంతి విధి పూర్వకంగా జరిపించుకోగలరు.

గ్రహణంలో ఏమి జరుగుతుంది?

గ్రహణం ఎలా సంభవిస్తుంది అనునది ఎవరికీ చెప్పక్కరలేదు. ఛాయా గ్రహాలైన రాహు కేతువులు సూర్యుని గానీ, చంద్రుని గానీ మింగటం అనేది చిన్న పిల్లలకు అర్థమయ్యేందుకు పూర్వీకులు చెప్పిన విషయాలు. రాహు కేతువులు కేవలం ‘ఛాయా గ్రహాలు ‘, అప్రకాశ గ్రహాలు అనేది మన వాళ్లకి తెలియక కాదు. కల గణనంలో, జ్యోతిష శాస్త్రంలో వీటి ప్రాముఖ్యత గొప్పది. ప్రతి గ్రహణానికి చంద్రునుతోనో లేక సూర్యునితోనో రాహువు లేదా కేతువు ఆ రాశిలో కలసి ఉండటం వేల సంవత్సరాల గణితంలోని లెక్కించబడ్డ అద్భుతాలు! పాశ్చాత్య జ్యోతిషంలో కూడా వీటిని ‘ నోడ్స్ ‘ అని పేర్కొని అధ్యయనాన్ని ముందుకు తీసుకొని వెళ్లారు…

అదలా ఉంచండి. మూడు వస్తువులు ఒక పంక్తిలోకి వచ్చినప్పుడు ఒక సిన్ర్జీ ఏర్పడుతుంది (ఎనర్జీల ఇచ్చి పుచ్చుకోవటం). రెండు వస్తువుల మధ్య అతి తక్కువ దూరం ఒక స్ట్రెయిట్ లైన్ ద్వారానే సంభవం అనేది మీకు తెలిసినదే!
ఈ క్రొద్ది సమయంలో జరిగే ఈ సినర్జీ ఏ గ్రహణానికైనా ముఖ్యమైన అంశం. అందు చేత ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణీ ఒక గ్రహమనే తలచి గ్రహములకు గల మంత్రములను (అవి స్పందించు ఫార్ములాలు) ఋషులు కనుగొని జపించి యున్నారు. గ్రహణ కాలంలో ఎవరికైనా గాయత్రి జపం అనివార్యం. ఇది సినర్జీని సమన్వయం చేయుటకు చేస్తారు. ఇంత చెప్పటం కష్టమని పిల్లలకు రాహువు వదలటం కోసం, కేతువు వదలటం కోసం అని పెద్దలు చెప్పటం వలన కొన్ని కథలుగా మనకి (కొంతమంది నవ్వుకునేందుకు గాను!) కనిపిస్తాయి. ఈ గూఢాన్ని గమనించగలరు.

1980-81లో సంభవించిన సంపూర్ణ సూర్యగ్రహణం ఎందరో వైఙ్ఞానికులను మన దేశానికి తీసుకుని వచ్చింది. ఆ సమయంలో రైలు పట్టాల మీద కూర్చున్న చిన్ని పిట్టలు రైలు వస్తున్నా కదలలేదు! సినర్జీని అవి తట్టుకోలేకపోవటం, దానిని సమన్వయం చేసుకొనే మార్గం లేకపోవటం దీనికి కారణం.

ఈ వారం విశేషాలు: సూర్య గ్రహణం వలన స్త్రీలు ప్రత్యేకంగా ఆరోగ్యం విషయంలో శ్రధ్ధ వహించవలసి యున్నది. స్పాండిలైటిస్ ఉన్న వారు, థైరాయిడ్ సమస్య ఉన్న వారు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. దక్షిణ భారత దేశంలో పంటలకు నష్టాలు కలుగ వచ్చును. ఒక పెను తుఫాను సంభవించవచ్చును. పురుషులు నేత్ర వ్యాధులకు గురి కాగలరు. పాలిచ్చే పశువులకు ఏదైనా అంటు వ్యాధి సోకే ప్రమాదం కనపడుతున్నది. రైతులు మిరప, మినుములు, దుంపల విషయంలో శ్రధ్ధ వహించాలి. అంటు వ్యాధులు ఇక్కడ కూడా ఉండవచ్చును.
నాయకులు తక్కువ మాట్లాడవలసిన సమయం. స్త్రీల గురించి చెప్పే మాటలు మీ రాజకీయ రంగానికి పూర్తిగా తెర దించేయ గలవు!

మేష రాశి:వారం పూర్వార్థంలో తలచిన పనులు నెరవేర గలవు. పాత స్నేహితులు అనుకోకుండా కలుస్తారు. ఒక తొందరపాటు వ్యవహారం కలవర పెడుతుంది. స్త్రీలు ఎక్కువ మౌనం పాటిస్తే మంచిది!

వృషభ రాశి: ఈ వారం జీవిత భాగస్వామితో వివాదాలు తలెత్తనున్నాయి. గొంతులో సమస్యలు ఏర్పడవచ్చును. పెద్దలు పరీక్షలు పెడతారు. నవ్వుతూ నెట్టుకు రావాలి. వాదన అనవసరం. వందనములతో సరిపెట్టండి!

మిథున రాశి: శతృవులెవరో మిత్రులెవరో తేల్చుకోలేకపోతారు. మీతో ఎప్పుడూ పోట్లాడుతున్న వారు మీ మిత్రులే అని గ్రహించండి! ఆదాయం, వ్యయం రెండూ బాగానే ఉన్నాయి. కళాకారులకు ఈ వారం మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి.

కర్కాటక రాశి: జీవిత భాగస్వామి ఆరోగ్యం అతి జాగ్రత్తగా చూసుకోవలసిన వారం. ఒక పనిని ఎంచుకోండి. ఎన్నో చేయాలనుకొని సమయం వృధా చేయవద్దు. వారాంతంలో ఒక మంచి పని పూర్తి కాగలదు.మీ కుమార్తెల విషయంలో మంచి వార్తలు వింటారు.

సింహ రాశి: ఒక సన్శయంతో వారం ప్రారంభమవుతుంది. అందులోంచి క్రమంగా తేరుకుంటారు. నరాల సమస్యలు, మైగ్రెయిన్ వంటివి బాధిస్తాయి. జాగ్రత్త వహించాలి. బంధువులు సహాయం కోరుతారు. కొత్త పనులు వాయిదా వేయండి.

కన్య రాశి: తల్లి వైపు బంధువులు మిమ్మల్ని కలవాలని ఆరాట పడుతున్నారు. విరోధాలు ఉన్న బంధువులు దగ్గరకు రావాలని అనుకుంటున్నారు. సమయం వృధా అవుతున్నదని మీరు అనుకుంటున్నారు. పనులు అవే సాగిపోతాయి. మీరు పట్టుకుంటే ఊరకే సాగుతాయి. దైవ చింతన లాభిస్తుంది!

తుల రాశి: మీ ఇంటిని ఇప్పటికి వంద మంది వాస్తు ‘విద్వాన్ ‘లకు చూపించి ఉంటారు. ఇంటిలో ఏమీ లేదు! ఒక భయం మిమ్మలను బాధిస్తోంది. దుర్గా సప్తశ్లోకీ పారాయణ చేయండి. ఆర్థిక లావాదేవీలు కొంత లాభిస్తాయి. అవివాహితులకు బంధు వర్గంలో సంబంధం విచారణకు వస్తుంది. చేసుకోవటంలో తప్పు లేదు!

వృశ్చిక రాశి: ఈ వారం ఈ రాశి వారికి చాలా బాగుంది. బంగారం కొనుగోలు చేస్తారు. భూ వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి.ఇతరులకు సలహాలు ఇవ్వాలని ఉంటుంది (నా లాగ!). వద్దు! ఇబ్బందులలో పడగలరు. పదోన్నతికి మీ పేరు పైకి వెళుతుంది. అడ్డంకులు తొలగుతాయి.

ధను రాశి:చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అది మిమ్మలను ఏ మాత్రం పట్టించు కోవటంలేదు! కళ్లజోడు మార్చాల్సి రావచ్చు. బలహీనంగా వారం ప్రారంభమైనా వారాంతానికి వేగం పుంజుకుంటుంది. సూర్యోపాసన చేపట్టండి. చాలా లాభిస్తుంది. పెట్టుబడుల జోలికి ఈ వారం వెళ్లవద్దు.

మకర రాశి: గ్రహణం కదా అని భయ పడకండి. దైవ బలం మీతో ఉన్నది. పార్వతీ పరమేశ్వరులను నిత్యం తలచుకోండి. ఈ గురువారం చక్కని అవకాశాలు రాగలవు. క్రీడాకారులు రాణిస్తారు. ఉంగరాలలో రాళ్లూ రప్పలూ వేసుకోవాలని అనిపిస్తుంది. ప్రస్తుతం తొందర పడకండి.

కుంభ రాశి: విదేశీ యానం గురించి అవకాశం రావచ్చును. స్వల్పమైన జ్వరం బాధిస్తుంది. అనుకున్న డబ్బు అందుతుంది. మీరు మీ మాటే అందరూ వినాలని అనుకోవటం ఈ వారం వదిలెయ్యండి. ఒక బదిలీ దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. వ్యాపారం లాభిస్తుంది.

మీన రాశి: బంధువులకు దూరంగా ఉండండి! మీరు మొదలు పెట్టిన ఒక మంచి పని వారాంతానికి పూర్తి కాగలదు. కాకపోతే పూర్తి అయ్యే ముందు ఆగిపోయినట్లు అనిపిస్తుంది. ఏదో చెయ్యబోయి చెడకొట్టుకోకండి. వయో వృధ్ధులు కడుపు నొప్పుల విషయంలో జాగ్రత్త వహించాలి. సుబ్రహ్మణ్య స్వామిని అర్చించండి.

ఈ వారం మంచి మాట:

శ్లో: యమిఛ్చేత్ పునరాయాతం నైనం దూరమనువ్రజేత్ /
ఇత్యమాత్యా మహారాజమూచుర్దశరరథం వచ://
(వాల్మీకి రామాయణం అయోధ్య కాండ 40.50)

మంత్రులు దశరథునితో చెప్పారు-ఎవరి గురించి అయితే త్వరగా వెనక్కి తిరిగి రావాలని కాంక్షిస్తారో, వారి వెనుక దూరం వరకు వెళ్ల కూడదు.

ఓం శాంతి: శాంతి: శాంతి:

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

5 thoughts on “25.01.2009 నుంచి 31.01.2009 వరకు రాశి ఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: