ఒబామా ప్రమాణ స్వీకారం-గ్రహాలు ఏమంటున్నాయి?-వేదాంతం శ్రీపతి శర్మ


యు.ఎస్. అధ్యక్షునిగా ఒబామా గారు ప్రమాణ స్వీకారం చేసిన సమయానికి మేష లగ్నం, నాలుగులో కేతువు, అయిదులో శని,ఎనిమిదిలో చంద్రుడు నీచ (అనురాధ),తొమ్మిదిలో కుజుడు,పదిలో రవి, బుధ, గురు, రాహువులు, ఏకాదశంలో శుక్రుడు కనిపిస్తున్నారు.

యోగం కొద్దిగా ఇంకో అరగంట ఈ పని కోసం పొడిగించి ఉంటే బాగుండేదేమో అనిపిస్తున్నది.

జాతకం ప్రకారం శని మహర్దశ నడుస్తున్నది. ఈ సంవత్సరం మే మాసంలో ఒక అవాంఛనీయమైన సంఘటన ఉన్నదా అనే ప్రశ్న తలెత్తుతున్నది!

గ్రహ స్థితిని బట్టి ఆర్థిక విధానాలు పరిస్థితులకు చేదు మందులాగా పని చేయవచ్చును. అందు చేత ప్రజలకు నచ్చక పోవచ్చు.

పంచమాధిపతి రవి దశమంలో శక్తిమంతుడై యున్నాడు. అందు చేత ప్రశాసనం బాగుంటుంది. రాహువు సంయోగం కొన్ని చికాకులను అపవాదుల ద్వారా తెచ్చి పెట్టవచ్చును. కానీ సమసి పోగలవు.

నవమాధిపతి గురువు దశమంలో (రాశిలో నీచ అయినప్పటికీ) మంచి యోగం ఇచ్చుచున్నాడు. ముఖ్యంగా మేధావుల సంప్రదింపు, విధానాల విషయంలో మంచి చర్చలు జరగటం వలన ఉపయోగాలు ఉండవచ్చును.

విదేశ వ్యవహారాలలో కొద్దిగా తొందరపాటు చర్యలుండవచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి!

అక్టోబర్ 2009 నుండి ఈ దేశం ఆర్థిక పరిస్థితి చాలా మెరుగు పడగలదు.

దేశంలోని వాయువ్య, పడమర ప్రాంతాలకు కొన్ని ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉంది.

చెదురు మొదురు సంఘటనల మినహా ఈ ప్రమాణ స్వీకారం సమయం ఒబామా గారికి మంచి ఫలితాలనే ఇవ్వగలదని తెలుస్తున్నది.

(Note: The views expressed are the writer’s personal ones based on Astrological inferences only)

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

3 thoughts on “ఒబామా ప్రమాణ స్వీకారం-గ్రహాలు ఏమంటున్నాయి?-వేదాంతం శ్రీపతి శర్మ

 1. ఆర్యా! నమస్తే.

  కందము:-
  వేదము సత్యము చెప్పును
  వేదాంతము శ్రీ పతి నుడి వేదము కన్నన్
  మోదమునగు. జ్యోతిషమున
  వేదాంతము వారి సాటి వేరొక రరుదే.

  మీ సెల్ నెంబరు నేను తెసుకో వచ్చా?
  అవకాశముంటే మెయిల్ చెయ్యగలందులకు మనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: