జూ అనగా ఏమి?-వేదాంతం శ్రీపతి శర్మ


పిల్లవాడు తన స్కూల్ డయరీ తండ్రికి ఇచ్చాడు.
‘ డాడీ, టీచర్ మిమ్మల్ని చూడమంది ‘
ఆయన తీసి చదివాడు. అందులో ఇలా వ్రాసి ఉంది-మీ అబ్బాయి బాగానే చదువుతాడు. కానీ విపరీతంగా వాదిస్తాడు. మేము చెప్పేదానికంటే అతను చెప్పేదే కరక్ట్ అని అంటాడు. క్లాసులో అందరికీ ఇబ్బందిగా ఉంది!

‘ ఎందుకిలా చేస్తావు? ‘ అడిగాడాయన.
‘ నేను నిజం చెబుతాను డాడీ. అది వాళ్లకి ఎందుకో నచ్చదు ‘
‘ ఏమి నిజం చెప్పావురా? ‘
‘ జూ అంటే డెఫినిషన్ అడిగారు. ‘
‘ నువ్వేమి చెప్పావు? ‘
‘ మనుషుల హావ భావాలను, వ్యవహారాలను జంతువులకు చూపించే ప్రదేశం జూ అని నేను చెప్పాను డాడీ! ‘
‘ ఆ..నువ్వు ఉల్టా చెప్పావురా! అలా కాదు ‘
‘ నువ్వు కూడా అలా అంటే ఎలా డాడీ? ఆదివారం రోజున నువ్వు మమ్మీ, నేను జూకి వెళ్లినప్పుడు మనం చూశాము కదా? ‘
‘ ఏమి చూశావు నాన్నా? ‘
‘ జనం అందరూ వింతగా ఏదోలాగా ముఖాలు పెట్టి ఇలా అలా చేతులతో ఏవేవో చేస్తుంటే అవి మటుకు అలా కూర్చునో, నిలబడో చూస్తున్నాయి. కోతులొక్కటే తిరిగి అలా చేశాయి…’
ఆయన తల గోక్కున్నాడు!
నిజమే. వీడన్నదాంట్లో నిజం ఉంది. కానీ స్కూలు వారు ఒప్పుకోరే! డయరీ తీసి ఏదో వ్రాయబోయి తన పిల్లవాడిని ఒక సారి చూశాడు. వీడిలోని చురుకుతనాన్నీ, తర్కించగలిగే సామర్థ్యాన్నీ ఈ స్కూలు వారు చెరిపేస్తున్నారు అని అనుకొన్నాడు.
‘ మా అబ్బాయి చెప్పినది కరెక్టే…’, ఆయన వ్రాశాడు, ‘…కాకపోతే లోకంతో పాటు పోవాలి. మీరు కూడా నిజాన్ని ఒప్పుకుని జూ జంతువులను చూసేందుకు ఏర్పాటు చేస్తారు. తెలియకుండా అవి కూడా మనుషులను చూస్తాయి అని చెప్పండి ‘
కుర్రాడు డయరీ తీసుకెళ్లి టీచర్ గారికి ఇచ్చాడు. ఆమె చూసి మరల ఏదో వ్రాసింది!
ఆయన మరల చదివాడు. ‘ ఇంతకీ మీరు టీచర్లా లేక మేమా? ‘ అని అందులో అడిగింది ఆమె!
ఆయన తడుముకోకుండా వ్రాశాడు, ‘ మీరే టీచర్లని తలచి పంపుతామండీ. కానీ జూలోని జంతువుల కోసం మనం వెళతామో లేక మనలను చూసేందుకు అక్కడ జంతువులను కూర్చోపెట్టారో మనం ఇంకా తేల్చుకోవాలి ‘

న్యాయానికి మెదడులోని ఎడమ భాగం తర్కానికి, ఆలోచనకీ పని చేస్తుంది. వైఙ్ఞానికుల పిల్లలు స్కూళ్లకు వెళ్లటం ప్రారంభించగానే ఈ భాగంలోని శక్తి క్షీణిస్తూ పోతోందని వైఙ్ఞానికుల అంచనా. ఆలోచన వదలి అనుకరణకు వాళ్లు అలవాటు పడతారు. ఇదే ప్రపంచం.

మార్క్ ట్వెయిన్ అందుకే ఒక మంచి మాట అన్నాడు-
‘ I did not allow my schooling to interfere with my education!’

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: