‘ఆ ‘ కలికాలం- వేదాంతం శ్రీపతి శర్మ


ట్రాఫిక్ జాం అవగానే ఆగీపోయి మామూలుగా ఆలోచిస్తున్నాను. నాకు ఎడమ ప్రక్కన ‘ ఫుడ్ అండ్ టెక్నాలజీ రిసర్చ్ ఇన్స్టిట్యూట్ ‘ అనే బోర్డ్ ను చూసినప్పుడల్లా వీళ్లు ఏమి చేస్తారు అని అనుకొనే వాడిని. ఆ బిల్డింగ్ ఎప్పుడూ మూసేసే ఉంటుంది. దీనితో నిజంగా పని లేనప్పుడు మనకి నిజంగా స్వాతంత్ర్యమా లేక ఎక్కువ పనున్నప్పుడా? ఏమో!

నాకు కుడి ప్రక్కన ఒక రోడ్ డివైడర్. అటు పోయే వారికీ, ఇటు వచ్చేవారికీ అది డివైడర్. ఉన్న వారికీ లేనివారికీ మధ్య అనిపించేటట్లు ఒక స్త్రీ దాని మీద కూర్చుని ఒక చిన్న పిల్లవాడిని, చెంగున ఒక చంటి పిల్లవాడినీ తగిలించుకుని వీలున్నపుడల్లా అడుక్కుంటోంది.

ఎవరో ఒక ప్లాస్తిక్ సంచీ-బిరియానీ అయి ఉంటుంది అలా విసిరేశారు. పిల్లవాడికి ఇచ్చింది. వాడు ఆతృతతో తింటున్నాడు. చూస్తూ చూస్తూనే అది ఖాళీ అవుతోంది. వాడు మాటి మాటికీ తల్లి వైపు చూస్తునాడు. తిను తిను అంటోంది. కొంతైనా మిగులుతుందా? …లేదు. వాడు తింటున్నాడు. తల్లికి ఆకలి లేదా? అంతలోనే ఆశ! అయినా తినమంటూనే ఉంది. వాడు తింటే తనకి నిజంగా ఆకలి తీరుతుందా? ఏమో!

2007వ సంవత్సరంలో ప్రపంచంలో వార్షిక ఆదాయం 51 ట్రిలియన్ డాలర్లు ఉంది. ఒక అంచనా ప్రకారం ఇది పెద దేశాలలోని దారిద్ర్యాన్ని తేలికగా తొలగించగలిగిన ఆదాయం. జి8 ఏమి చేయలేని స్థితిలో ఉంది. వారి అంచనా ప్రకారం మొదటి టయర్లో యు.ఎస్. తో పాటు ఉన్న దేశాలు ప్రపంచంలోని 20% జనాభాతో ఉండి ప్రపంచంలోని 80% ఆదాయాన్ని దగ్గర పెట్టుకున్నారు!

రెందవ టయర్లో 30 దేశాలు మధ్య రకమైనవి, కొన్ని పేద దేశాలు 7% అభివృధ్ధిని ఎలాగో అలాగ నిలబెట్టుకుని ప్రపంచ ఆర్థిక వ్యవస్థనుంచి కొంత లాభం పొంది ఉన్నాయి.ఇందులో చైనా, మన దేశం ఉన్నాయి.

మూడవ టయర్లో 50 దేశాలు కొంత అభివృధ్ధి పొందినా మరల సమస్యలలోకి వెళ్లాయి.

నాల్గవ టయర్లో ఒక బిలియన్ మంది ఎన్నో అవాంతరాలతో (ఆఫ్రికా లాంటివి ) ఊగిసలాడుతున్నాయి.

రాబోయే 50 ఏండ్లలో మన భూగోళానికి 3 బిలియన్ల మంది చేరబోతున్నారు. వీరు 2, 3,,4 టయర్లలో చేరబోతున్నారు.

అదలా ఉంచండి. ప్రస్తుతం ఉన్న యు.ఎస్.  ఆర్థిక సమస్య వలన చాలా దేశాలలో తిండి సమస్య ఏర్పడినది. దిగుమతుల మీదనే ఆధార పడ్డ ఆర్థిక వ్యవస్థలన్నీ దెబ్బ తింటున్నాయి! చైనా ఎరువుల ఎగుమతి ఆపేసింది.
పెద్ద వారికి సమస్యలు రాకూడదు. అవి ఎంతవైనా అందరినీ ఇబ్బంది పెట్టేవే!

జార్జ్ బుష్ గారు భారతీయులు తిండిపోతులు అని పలికియున్నారు!

ఆయనకు ఒక ఆర్థిక శాస్త్రవేత్త ‘ సార్, భారత చైనా దేశాలలో తిండికి డిమాండ్ ఎక్కువగా ఉన్నందు వలన మార్కెట్ వారికి అనుకూలంగా ఉంది ‘ అని చెప్పాడట. ఆయనకు ఆ ఎకనమిక్స్ భాష బుర్రకి ఎక్కలేదు. వాళ్లు అంత తింటారా? అనుకున్నాడు!

మార్కెట్ను ఎవరు సృష్టించి ఇంతకాలం పాలించారు? అదే మార్కెట్ అందరినీ శాసిస్తుంది. ఆకలినీ, అన్నాన్నీ, ‘అ అమ్మా ‘ కంటే ‘ఆ  ఆకలి ‘ అనేది ముందు నేర్చుకున్న దేశాలు అర్థం చేసుకున్నట్లు ఎవరూ అర్థం చేసుకోరు!

ఆ మాటకొస్తే అన్నమొక్కటే మార్కెట్ కాదు. ఆకలి కూడా మార్కెట్టే! 80% ఆదాయం దగ్గర ఉన్నప్పిటికీ ‘ ఆదాయం ‘ అనే దానిని నేను ఏ విధంగా గుర్తిస్తాను అనేది కీలకం. కాపిటల్ తిండి పెట్టదు!

మన ఆర్థిక శాస్త్రవేత్తలకు ఉన్న ముందు చూపు చాలా తక్కువ మందికి ఉన్నదన్నది యదార్థం.
 
ఏవో ఆలోచనలు…త్రాఫిక్ కదిలింది. నేను ముందుకు వెళ్లాను. సిధ్ధాంతాలూ, ఇన్స్టిట్యూత్ లు, శాస్త్రాలు ఏమొ! ఆ తల్లిని తలచుకుంటే జాలి వేసింది!

‘ ధన్యుడెవరు? ‘ అని జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు చెప్పారు, ‘ వర్ధమాన సౌజన్యుడు ధన్యుడు. ఆర్తజన సౌఖ్య విధాన పథాగ్రగణ్యుడు ధన్యుడు! ‘

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: